![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -475 లో.... కార్తీక్, దీప కిచెన్ లో మాట్లాడుకుంటారు. మా అమ్మనాన్న ఇద్దరు మొండి వాళ్లేనని దీప అంటుంటే.. అప్పుడే జ్యోత్స్న, పారిజాతం వస్తారు. ఎవరో తెలియని అమ్మ నాన్న గురించి మాట్లాడుకుంటారా నేను ఎలా అర్థం చేసుకోవాలని జ్యోత్స్న అంటుంది. వాళ్ళిద్దరు వచ్చి కార్తీక్ కి కోపం వచ్చేలా మాట్లాడతారు. నువ్వు ప్రొద్దున నుండి ఏం తినలేదు దీప త్వరగా తినమని కార్తీక్ చెప్పి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత శ్రీధర్ ఇంటికి పారిజాతం, జ్యోత్స్న వెళ్తారు. కాశీ నా తమ్ముడు, తను జాబ్ లేక ఇబ్బంది పడుతున్నాడు కదా.. హెల్ప్ చెయ్యాలని వచ్చానని జ్యోత్స్న అంటుంది. రెస్టారెంట్ లో మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉందని జ్యోత్స్న అనగానే మా అల్లుడు చదువుకి మేనేజర్ ఏంటని కావేరి అంటుంది. అయితే ఐటీ కంపెనీలో నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు చెప్తాను.. అయ్యో ఫోన్ కార్ లో ఉంది స్వప్న.. వెళ్లి డ్రైవర్ ని ఫోన్ తీసుకొని రమ్మని చెప్పమని జ్యోత్స్న అంటుంది. స్వప్న కోపంగా బయటకు వెళ్తుంది. తీరా చూస్తే అక్కడ కార్తీక్ ఉంటాడు. కార్తీక్ ని చూసి స్వప్న బాధపడుతుంది. కార్తీక్ లోపలికి వస్తాడు. మరొకవైపు దీప కళ్ళు తిరిగిపడిపోతుంది. అది సుమిత్ర చూసి దీపని లేపే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత కార్తీక్ ని డ్రైవర్ అంటున్నావ్.. తను నీ బావ అని శ్రీధర్ అంటాడు.
కార్తీక్ కి సుమిత్ర ఫోన్ చేసి దీప కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తుంది. దీప నీరసంగా కళ్ళు తిరిగి పడిపోయిందట.. పదండీ వెళదామని జ్యోత్స్న తో కార్తీక్ అంటాడు. కాశీ నీకు జాబ్ చూస్తానని జ్యోత్స్న అనగానే వద్దని కాశీ అంటాడు. ఖర్చుకి డబ్బు ఇస్తుంటే.. నా అల్లుడుకి నేను ఇస్తాను, నువ్వు వద్దని శ్రీధర్ అంటాడు. మరొకవైపు దీపని సుమిత్ర లేపి తనకి భోజనం తీసుకొని వస్తుంది. మానవత్వం కొద్దీ భోజనం తెచ్చాను కానీ నీకు తినిపించేంత ప్రేమ లేదని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |